- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో ‘డబుల్ ఎంట్రీ’కి నో చాన్స్.. ‘దిశ’ కథనంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
జనగణన సర్వేలో ఒకే కుటుంబ వివరాలు రెండుసార్లు నమోదవుతున్నాయన్న ‘డబుల్ ఎంట్రీ’ వార్తలపై జనగణన శాఖ అధికారులు స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటింటి సర్వే సందర్భంగా ఒకే కుటుంబ వివరాలు రెండుసార్లు నమోదు కావడానికి ఎలాంటి అవకాశం లేదని జనగణన శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జనగణన ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చిన ‘స్వీయ-గణన (Self-Enumeration - SE)’ విధానం, దానికి అనుసంధానమైన సాంకేతిక వ్యవస్థను పరిశీలిస్తే అలాంటి తప్పులు జరగవని అధికారులు వివరించారు. ‘దిశ’ దినపత్రికలో ‘డబుల్ ఎంట్రీ’ పేరుతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో భాగంగా ఒకసారి ఐడీ (ID) క్రియేట్ అయిన తర్వాత, ఆ కుటుంబం ఏ ప్రాంతంలోనైతే నమోదు చేసుకుందో అక్కడి ఎన్యూమరేటర్‌కు మాత్రమే అది అనుసంధానమై ఉంటుంది. అదే ఐడీని వేరే ప్రాంతంలో గానీ, లేదా వేరే ఎన్యూమరేటర్ వద్ద గానీ ఉపయోగించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ఐడీ ఇతర హౌస్ లిస్టింగ్ బ్లాక్ (HLB) లేదా ఇతర ఎన్యూమరేటర్ల డేటాతో మ్యాచ్ అవ్వదు.
ఇక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీని ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ తన వద్ద ఉన్న ‘హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ యాప్’లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వివరాలను సరిపోల్చి, పూర్తిగా ధ్రువీకరించిన తరువాత మాత్రమే ఆ సమాచారం తుది డేటాగా పరిగణించబడుతుంది. స్వీయ గణన ప్రక్రియ అనేది ప్రజలకు సౌకర్యం కల్పించడం, సమాచార సేకరణను వేగవంతం చేయడం, మరియు డేటా కచ్చితత్వాన్ని పెంచడం లక్ష్యంగా రూపొందించబడింది. అధికారిక మార్గదర్శకాల ప్రకారం వ్యవస్థలో పకడ్బందీ సాంకేతిక నియంత్రణలు ఉన్నందున, ఈ విధానం ద్వారా డబుల్ ఎంట్రీ జరిగే అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు.






