- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala: ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు: ఈటల
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్షం అధికార పక్షం ఎవరు శాశ్వతం కాదని ఎన్నికల వరకే పార్టీలు ఉండాలి ఆ తర్వాత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ (Medchal Malkajgiri Municipality) తొలి పాలకవర్గం పదవీ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహ రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేష్, కార్పొరేటర్లకు ఈటల అభినందనలు తెలిపారు. మీకు అందాల్సిన నిధులు సరిగ్గా అందలేదు. రూ.65 కోట్లు నిధులు ఖర్చు చేస్తే రూ.62 కోట్లు మీ సొంత ఆదాయం ఉండగా.. రూ.8 కోట్లు పట్టణ ప్రగతి, రూ.7 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చాయని అని మీ లెక్కలు చెప్తున్నాయన్నారు. రాజకీయనాయకుడు పదవి ఉన్న లేకున్నా ప్రజల మధ్యే ఉంటారని మళ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు తీర్చాలని సూచించారు.
వాటిని నేను పూర్తి చేస్తా:
మేడ్చల్ మున్సిపాలిటీ మొదలు పెట్టిన పనులు నేను పూర్తి చేస్తానని ఈటల భరోసా ఇచ్చారు. నా ఇల్లు కూడా ఈ మున్సిపాలిటీ లో ఉందని, నీరడి కాడు తన మడిని ఎండగొట్టుకోడు అన్నట్టు ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రతిపక్షం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గొడవలు పెట్టుకుంటే ముందుకు పోలేమన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మీ అందరూ మా ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించారు. చెరువులు మురికి కూపాలుగా మారిపోయాయని మేడ్చల్ లో ఉన్న నాలుగు చెరువులను మంచినీటి చెరువులుగా మార్చాలని మీ నిర్ణయం స్వాగతిస్తున్నానని పనులు నాణ్యతగా చేయాలని కమిషనర్ ను కోరుతున్నానన్నారు.






