గంజాయి దందాలోకి మహిళలు

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లాలో గంజాయి దందా ఇంతింతై.. వటుడింతయై.. అన్న చందంగా పెరిగిపోతోంది. ఇప్పటి దాకా గంజాయి స్మగ్లింగ్ లో పురుషులే భాగస్వాములు కాగా తాజాగా మహిళలు ఎంట్రీ ఇచ్చారనే విషయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

గంజాయి దందాలోకి మహిళలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గంజాయి దందా ఇంతింతై.. వటుడింతయై.. అన్న చందంగా పెరిగిపోతోంది. ఇప్పటి దాకా గంజాయి స్మగ్లింగ్ లో పురుషులే భాగస్వాములు కాగా తాజాగా మహిళలు ఎంట్రీ ఇచ్చారనే విషయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గురువారం కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో 13 కిలోల గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.

మధ్య ప్రదేశ్ నుండి నిజామాబాద్ వయా నాందేడ్..

ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన గంజాయి దందా నిందితులు రాష్ట్రంలోని సిర్పూర్ నుండి గంజాయిని ని నాందేడ్ మీదుగా జామాబాద్ కు తీసుకొచ్చారు. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు పూజా పవార్, దుర్పార బాయి జాదవ్ అనే ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్ లోలి సిర్పుర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేశారు. కిలో గంజాయి రూ. 9 వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి కిన్వట్ లో ఏ3, ఏ4 నిందితులైన ను కిషన్ మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుసుకొని బస్‌సు ద్వారా నిర్మల్ కు వచ్చి. అక్కడి నుండి నిజామాబాద్ కు వచ్చి రిలయన్స్ మార్ట్ వద్ద ఏ5 నిందితుడు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ కు చెందిన మంజ వెంకట్రామ్ కిలో గంజాయిని రూ. 15 వేలచొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులకు నిందితుడు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ గంజాయిని కిలో రూ. 20 వేలకు అమ్ముతానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇట్టి దాడుల్లో ఎక్సైజ్ సీఐ స్వప్రతో పాటు, ఎస్ ఐ లు మల్లేష్ , సునిత, సిబ్బంది సునీల్ , ప్రభాకర్ , రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ లు కూడా ఉన్నారు.

పోలీసులు అరెస్ట్ చేసింది వీరినే..

ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలం దేవులా తండా కు చెందిన మహిళ పూజా పవార్, ఆదిలాబాద్ జిల్లా కుప్టి (కె) గ్రామానికి చెందిన పూజా పవార్, మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వట్ కు చెందిన కిషన్ మోతీరాం దాలే, యత్ మాల్ జిల్లా ఉమర్ ఖేడ్ గ్రామానికి చెందిన ఇంద్రిజిత్ టాగ్రే, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ కు చెందిన మంజ వెంకట్రామ్ లను పోలీసులు ఈ గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 13 కిలోల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Next Story