ఆర్మూర్ లో ప్రజాభిమానంతో మైసమ్మగా నిలబడతాం : ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి

by Disha Web Desk 1 |
ఆర్మూర్ లో ప్రజాభిమానంతో మైసమ్మగా నిలబడతాం : ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి
X

తొలిసారిగా ఆర్మూర్ కు వచ్చిన రాకేష్ రెడ్డికి బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజాభిమానంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్లో మైసమ్మగా నిలబడతామని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఇటీవలే బీజేపీలో చేరిన పైడి రాకేష్ రెడ్డి తొలిసారిగా ఆర్మూర్ కు రావడంతో మంగళవారం బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పాలికాయి.

ముందుగా ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ అరవింద్, పైడి రాకేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ గజమాలతో కార్యకర్తలు పైడి రాకేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లను సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో ఆర్మూర్ గడ్డమీద బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఇక మీదట ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకే తన జీవితం అంకితమని అని అన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న దౌర్జన్యాలు, బెదిరింపులు, హత్య రాజకీయాలు ఇక మీదట ఉండబోవని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటానని రాకేష్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆర్మూర్ అసెంబ్లీలో అత్యధిక మెజారిటీతో గెలిపించి బీజేపీ అధినాయకత్వానికి కానుక ఇస్తానని తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అహంకారపూరిత హత్యా రాజకీయాలకు నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడాలన్నారు. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ ప్రజలకు అండగా ఉన్నాడని, ఇంతకు ముందు ఓ లెక్క.. ఇప్పుడోలెక్క అని హెచ్చరించారు.

ఆర్మూర్ నుంచి రాజకీయ మార్పు మొదలవ్వాలి: ఎంపీ ధర్మపురి అరవింద్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఆర్మూర్ నుంచి రాజకీయ మార్పు మొదలవ్వాలని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీలో చేరి తొలిసారిగా ఆర్మూర్ కు వచ్చిన పైడి రాకేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులకు ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఫోన్లు చేసి ర్యాలీకి వెళ్లొద్దంటూ 100 కార్లను ఆపినా.. 300 పైచిలుకు కార్లతో బీజేపీ శ్రేణులు దండయాత్రల వలె ఆర్మూర్ కార్ల ర్యాలీలో పాల్గొన్నందుకు అభినందనలు తెలిపారు.

తొలిసారిగా కల్వకుంట్ల కుటుంబానికి ఓటమిని ఇందూరు గడ్డ నేర్పిందని, అందులో అత్యధికంగా ఆర్మూర్ నియోజకవర్గమే బీజేపీకి పూర్తి మెజారిటీని ఇచ్చిందని అన్నారు. సమాజంలో మెజారిటీగా అన్ని కులాలు హిందువులేనన్నారు. హిందువులందరూ హిందుత్వాన్ని బలపరిచే బీజేపీకే పలకాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని 50వేల పైచిలుకు ఓట్లతో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి సుచరితా రెడ్డి, పల్లె గంగారెడ్డి, నూతల శ్రీనివాస్ రెడ్డి, జెస్సు అనిల్ కుమార్, జీ.వి.నరసింహారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, బద్దం లింగారెడ్డి, యాల్ల రాజ్ కుమార్, పాలెపు రాజు, ద్యాగ ఉదయ్ కుమార్, పెర్కిట్ పసుపుల సాయికుమార్, జానకంపేట సంతోష్ రెడ్డి, అంకాపూర్ సురేష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అందాపూర్ రాజేష్ పాల్గొన్నారు.


Next Story