- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం ఉన్నందున మండలంలో నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ తెలిపారు.

దిశ, కమ్మర్ పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం ఉన్నందున మండలంలో నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జె. భూమేశ్వర్ ఎరువులు, మానాగ్రోమోర్ సెంటర్‌లలో అధిక మొత్తంలో పారాక్వాట్ కలుపు మందు ఉన్నట్లు గుర్తించి 60 రోజుల వరకు అమ్మకాలను నిలిపివేయాలని స్టాప్ సేల్ ఆర్డర్ కాఫీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారాక్వాట్ అనే గడ్డిమందు అత్యంత విష పూరితమైనది అని ఇది ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారిందన్నారు. ఈ మందు వల్ల పంట ఉత్పత్తులు కూడా విషపూరితమయ్యే ప్రమాదం ఉందని సూచించారు. మండలంలోని పురుగుమందు డీలర్లు ఈ గడ్డి మందులు అమ్మకూడదని అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు గడ్డి మందులు కొనకూడదని, వాడకూడదని తెలిపారు.






