- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రెండు ద్విచక్ర వాహనాలు దగ్దం
గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రెండు ద్విచక్ర వాహనాలు దగ్దం
by Ratna Kumari |
వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఒక స్కూటీ, బైకు పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో రెండు ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి.

X
దిశ, వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఒక స్కూటీ, బైకు పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో రెండు ద్విచక్ర వాహనాలు దగ్దమయ్యాయి. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్ కుమార్ గౌడ్ స్కూటీ ని గత వారం రోజుల కిందట కొనుగోలు చేసి తిప్పుకుంటున్నారు. రాత్రి సమయంలో ఇంటి ముందు పెట్టి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దాని పక్కనే ఉన్న మహేందర్ గౌడ్ బైక్ కూడా దగ్ధమైనట్టు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి సంజీవ్ తెలిపారు. ఈ బైకుల దగ్ధంవెనుక ఎవరున్నా వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు.
Next Story






