ఆర్మూర్ లో చైనా మాంజా అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్

by Ratna Kumari |

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిషేధిత చైనా మాంజలు అమ్ముతున్న షాపు యజమాని నారాయణ, రవి లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ బుధవారం తెలిపారు.

ఆర్మూర్ లో చైనా మాంజా అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్
X

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిషేధిత చైనా మాంజలు అమ్ముతున్న షాపు యజమాని నారాయణ, రవి లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ బుధవారం తెలిపారు. చైనా మంచాలు అమ్ముతున్న షాపు నుంచి సుమారు రూ. 18,050/- విలువగల చైనా మాంజాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ లో హోల్ సేల్ గా అమ్ముతున్న జహీర్ ఖాన్ అనే వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Next Story