అన్నిదారులు లోహకే..

by Disha Web Desk 20 |
అన్నిదారులు లోహకే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహరాష్ర్టలో బీఆర్ఎస్ అవిర్భావ సభసక్సెస్ జోష్ తో ఇప్పుడు నాందేడ్ జిల్లాలో రెండవ మహసభకు బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా సరిహద్ధుకు 130 కిలోమీటర్ల దూరంలోని కాంధార్ లోహ పట్టణంలో జరిగే మహరాష్ర్ట రెండవ మహసభను సక్సెస్ చేసేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డికి నాందేడ్ జిల్లా ఇంచార్జి భాధ్యతలు ఉండటంతో, పొరుగున ఉన్న బోదన్ ఎమ్మెల్యే షకిల్ అమేర్ సైతం అక్కడే తిష్టవేశారు. ఈ నెల 26న బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొనే బహిరంగ సభను సక్సెస్ కోసం గతవారం రోజులుగా అక్కడ ఎర్పాట్లలో బిజీ అయ్యారు.

ఫిబ్రవరి 5న నాందేడ్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు వచ్చిన జనసందోహంతో అదే స్థాయిలో మహరాష్ర్టలోని నాందేడ్ జిల్లాలోని లోహ పట్టణంలో జరిగే బీఆర్ఎస్ సమావేశం పై పోకస్ పెట్టారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోదన్ నియోజకవర్గాలలోని ద్వితియ శ్రేణి నాయకులు లోహ బాట పట్టారు. నాందేడ్ జిల్లా లోహలో తిష్ట వేసిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకిల్ అమీర్ లు గత వారం రోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువేళ్లేందుకు ప్రయత్నాలు చెపట్టిన విషయం తెలిసిందే. 16 వీడియో స్క్రీన్ ప్రచార రధాలు కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల 16 తాలూకాలలో ఉన్న 1600 గ్రామాల్లో తెలంగాణ పథకాల గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేశారు.

స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకర్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం లాంటి నాయకులతో కలిసి ప్రచార కరపత్రాలను ముద్రించి నియోజకవర్గం అంతా వాల్ పోస్టర్ లు వేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 26న జరిగే బహిరంగసభ సక్సెస్ కోసం జిల్లాకు చెందిన ఇద్ధరు ఎమ్మెల్యేలను డిల్లీకి పంపలేదు కేసీఆర్. లిక్కర్ స్కాం ఉదంతం నేపథ్యంలో అందరు మంత్రులు, జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు డిల్లీకి వెళ్లిన లోహసభ పై కేసీఆర్ ప్రతిష్టత్మకంగా తీసుకోవడంతొ ఇద్ధరిని మహరాష్ర్ట నుంచి కదిలించలేదు.

లోహలో లక్ష మంది జనంతో నిర్వహించే సభ సక్సెస్ కోసం ఆర్మూర్, బోదన్ నియోజకవర్గాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను తరలిస్తున్నారు ఎమ్మెల్యేలు. అక్కడ ప్రజలను మోబిలైజేషన్ భాధ్యతలను అక్కడ లోకల్ లీడర్ లతో పాటు ఇక్కడ నాయకులకు భాధ్యతలను అప్పగించారు. లోహసభలో పెద్ధఎత్తున నాయకులు, బీఆర్ఎస్ లో చేరేవిధంగా ప్రణాళికలను రూపోందిస్తున్నారు. నాందేడ్ సభ విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో లోకల్ లీడర్లతో ఇక్కడి లీడర్లను సమన్వయం చేసుకుంటునే సక్సేస్ అవుతామని నమ్మి రెండు నియోజకవర్గాల లీడర్లకు స్వయంగా ఎమ్మెల్యేలు పోన్ లు చేసి రప్పిస్తున్నారు. ఉగాది పండగ ఉన్నా సరే అక్కడే సభ అయిపోయే వరకు ఉండాలని లీడర్లకు హుకూం జారీ చేశారు. దానితో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ లీడర్ల, ప్రజాప్రతినిధులు లోహకు బయలుదేరి వెళ్లగా మరికొందరు పండగ తరువాత తరలివేళ్లేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు.

లక్ష మందికి పైగా "మహా"జనంతో సభ జరుగుతుంది. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర లోని కాందార్ లోహ లో జరిగే బిఆర్ఎస్ మహసభ లో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాకకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed