- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ సిబ్బందికి వీటిని తప్పక ధరించాలి
నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సీపీ పోతరాజు సాయిచైతన్య గురువారం చలువ కళ్లద్దాలు, కూలింగ్ స్టోరేజ్ వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 20: నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సీపీ పోతరాజు సాయిచైతన్య గురువారం చలువ కళ్లద్దాలు, కూలింగ్ స్టోరేజ్ వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో పోలీస్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తన కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అతినీల లోహిత కిరణాల వలన జబ్బులు వచ్చి అనారోగ్యానికి గురవుతున్న సందర్భంగా ఈ కళ్లద్దాలను సిబ్బంది ప్రతి ఒక్కరు తప్పక ధరించాలన్నారు. ఈ కళ్లద్దాలు ధరిస్తే దుమ్ము, ధూళీ కారణంగా కంటికి ఎలాంటి ప్రమాదం కలగదని, సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీటి బాటిల్స్ ఉపయోగించుకోవాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని, సిబ్బందికి ఇంకా ఎలాంటి అవసరాలున్నా తన దృష్టికి తీసుకురావాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసీ అధ్యక్షులు మధుసూధన్, శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుధాకర్, సంతోష్ ట్రెజరర్ సాయిలు, ట్రాఫిక్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.






