గత పాలకులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వాటర్ ఫిల్టర్ బెడ్లు అస్తవ్యస్తం

by Disha Web Desk 15 |
గత పాలకులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వాటర్ ఫిల్టర్ బెడ్లు అస్తవ్యస్తం
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఇందూర్ జిల్లా నగరపాలక సంస్థ మంచినీటి కోసం నిర్మించిన అలిసాగర్, ఖిల్లా వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టులను శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ రోబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటు ప్రజలు తాగే మంచినీటి ఫిల్టరింగ్ ఎలా జరుగుతుందని పరిశీలించడానికి వచ్చినట్టు తెలిపారు. అలిసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 0.30 టీఎమ్సీలు ఉండగా ఇప్పుడు ఉన్న నీటి సామర్ధ్యం రెండు నెలలకు సరిపోతుందని తెలిపారు.

కానీ సగం యంత్రాలు పనిచేయడం లేదని, అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఖిల్లా వాటర్ ఫిల్టర్ కూడా చాలా దారుణమైన దుస్థితిలో ఉందని, సరైన మెయింటెనెన్స్ లేక ఫిల్టర్ అయిన నీటిలో నాచు, వేస్ట్ పదార్ధాలు చెత్త పెరుకపోయి ఉన్నాయని, ప్రజల జీవితాలతో ఇరిగేషన్ అధికారులు ఆడుకుంటున్నారని, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శం అని మండిపడ్డారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో దీని పై నివేదిక ఇవ్వాలని, యంత్రాలు అన్నీ పనిచేసేవిధంగా చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన తాగు నీటిని నగర ప్రజలకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ కార్పొరేటర్స్, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed