స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల నిర‌స‌న

by Ratna Kumari |

త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం టీజీ ఈజేఏసీ లింగంపేట మండ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల నిర‌స‌న
X

దిశ‌, లింగంపేట : త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం టీజీ ఈజేఏసీ లింగంపేట మండ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్ర‌ధాన డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకొని జూన్ 02 లోప‌ల అమ‌లు ప‌ర‌చాల‌ని.. 2004 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పెండింగ్ లో ఉన్న‌టువంటి అన్ని ర‌కాల బిల్లుల‌ను ఉద్యోగ ఉపాధ్యాయులంద‌రికి చెల్లించాల‌ని.. ఉద్యోగ ఉపాధ్యాయుల‌కు పెన్ష‌న‌ర్లంద‌రికీ ఆరోగ్య కార్డులు, మే మొద‌టి వారం నుంచి అమ‌లు చేయాల‌న్నారు.

రాష్ట్రంలోని అన్ని రకాల ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ అమలులో ఉన్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమును అమలు చేయాలని, అలాగే సెప్టెంబర్ ఒకటి 2004 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి వాటి ద్వారా నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ కోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని త‌హ‌శీల్దార్ సురేష్ కి విన‌తి పత్రం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీజీ ఈజేఏసీ అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ పీఆర్టీయూ టీఎస్ మండ‌ల అధ్య‌క్షులు కొట్టూరి సురేష్, ఉద్యోగ సంఘాల నేత‌లు సుధాకర్ రావు, రాజారెడ్డి, రజనీకాంత్ గౌడ్,సంతోష్, శివరంజని, నాగరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Next Story