వీఆర్ఏలకు మద్దతు తెలిపిన తహసీల్దార్ శంకర్

by Disha Web Desk 20 |
వీఆర్ఏలకు మద్దతు తెలిపిన తహసీల్దార్ శంకర్
X

దిశ మాక్లుర్ : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి మాక్లుర్ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మండల తహసీల్దార్ సంఘీభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారన్నారు. అదే విధంగా పెన్షన్ల వ్యవస్థలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు సుమారు ఏడాదిన్నర గడిచినప్పటికీ కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు తొందర్లో న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని, అందుచేత వీఆర్ఏలు సమన్వయంతో సమ్మె కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకూడదని వీఆర్ఏలను సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, వీఆర్ఏ, జేఏసి జిల్లా చైర్మన్ గైని దయాసాగర్, జిల్లా సెక్రెటరీ వేముల సాయన్న, డివిజన్ అధ్యక్షులు, నాయకులు చెలిమిల రాములు, సాయినాథ్, నీరాడి గంగాధర్, హరిచరణ్ సదానంద్, మండల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed