రాజ్యసభలో సురేష్ రెడ్డి బావోద్వేగ ప్రసంగం

by Ratna Kumari |

రాజ్యసభలో వీడ్కోలు సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.ఆర్. సురేష్ రెడ్డి భావోద్వేగపూరితంగా గురువారం ప్రసంగం చేశారు.

రాజ్యసభలో సురేష్ రెడ్డి బావోద్వేగ  ప్రసంగం
X

దిశ ఆర్మూర్ : రాజ్యసభలో వీడ్కోలు సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.ఆర్. సురేష్ రెడ్డి భావోద్వేగపూరితంగా గురువారం ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభాపతికి, ఉప సభాపతులకు, ప్యానెల్ ఛైర్మన్లకు, రాజ్యసభ కార్యదర్శి సిబ్బందికి కే. ఆర్ సురేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో వారు చూపిన మార్గదర్శకత్వం, సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ ప్రయాణం 2020లో ప్రారంభమై, కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో సభ ప్రజల ప్రాణాలు, ఉపాధి రక్షణ కోసం జరిగిన చర్చలను ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గల్వాన్ ఘటనలో సైనికుల త్యాగాన్ని స్మరించారు.


తన నాయకుడు శ్రీ కెసిఆర్ పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి 14 సంవత్సరాల పాటు సాగిన ఉద్యమాన్ని గర్వంగా ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలు కేవలం రాజకీయ సంస్థలు కాకుండా ప్రజల ఆశయాలు, సంస్కృతి, భాషలకు ప్రతినిధ్యమని సురేష్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విధానం ప్రకారం దేశ ప్రయోజనాలు, రాష్ట్ర హక్కుల దృష్ట్యా అవసరమైనప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, అవసరమైనప్పుడు వ్యతిరేకించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజ్యసభను ‘హౌస్ ఆఫ్ ఎల్డర్స్’గా ప్రశంసిస్తూ, లోక్‌సభకు అనుబంధంగా దేశ ప్రజాస్వామ్యాన్ని సమతుల్యం చేసే కీలక వేదికగా అభివర్ణించారు. పార్లమెంట్‌లో మరింత సౌహార్ద వాతావరణం నెలకొనాలని, సభ్యుల మధ్య క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం పార్లమెంటేరియన్లకు క్రీడా పోటీలు నిర్వహించాలని సురేష్ రెడ్డి సూచించారు. తర్వాత రాష్ట్రపతి భవన్ లో రాజ్యసభ సభ్యులుగా వీడ్కోలు పొందుతున్న అందరు సభ్యులతో రాష్ట్రపతి, ఇతర అధికారులందరూ గ్రూప్ ఫోటో దిగారు.

Next Story