- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలి
ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అన్నారు

దిశ, కామారెడ్డి టౌన్ : ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలీసు స్టేషన్ అధికారితో (యస్ ఐ) ఎస్ హెచ్ ఓలతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారం వెంటనే తెలుసుకోవాలని, ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చూడాలన్నారు. రౌడీ, అనుమానిత హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారిని తరచూగా చెక్ చేస్తూ ఉండాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్, ఎటియం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్థలాల యందు సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.






