అల్లుడు కాదు... అగ్ని దేవుడే.. మొత్తం కాల్చేశాడుగా..!

by Bhanu |

అప్పుగా ఇచ్చిన డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో కక్ష కట్టిన అల్లుడు బిడ్డనిచ్చిన మామ టీవీఎస్ ఎక్సెల్ వాహనం తోపాటు వరి ధాన్యం కుప్పకు నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాసాని పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

అల్లుడు కాదు... అగ్ని దేవుడే.. మొత్తం కాల్చేశాడుగా..!
X

దిశ, నాగిరెడ్డిపేట్ : అప్పుగా ఇచ్చిన డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో కక్ష కట్టిన అల్లుడు బిడ్డనిచ్చిన మామ టీవీఎస్ ఎక్సెల్ వాహనం తోపాటు వరి ధాన్యం కుప్పకు నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాసాని పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాసానిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాలమణి, సాయిలు అనే దంపతులు తమ బిడ్డనిచ్చిన అల్లుడైన బాలకృష్ణ కుటుంబం వద్ద రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడానికి సమయం మించి పోవడంతో ప్రతికారంగా తమ కూతురును ఇంటి వద్ద వదిలి వెళ్ళాడని, అనంతరం ఈనెల 23వ తేదీన తమ కూతురును తిరిగి తీసుకెళ్లాడన్నారు.


జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని తమ అల్లుడైన బాలకృష్ణ గురువారం రాత్రి చాకలి సాయిలు ఇంటిముందు గల టీవీఎస్ ఎక్సెల్ ను పూర్తిగా తగలబెట్టాడని, రాత్రివేళ ఏదో శబ్దం వస్తుందని బయటకు వచ్చి చూడగా, ఎక్సెల్ వాహనం పూర్తిగా కాలిపోయిందని, అలాగే ఊరు బయట ఉన్న వరి ధాన్యం కుప్పను కూడా తగలబెట్టాడని చాకలి సాయిలు భార్య బాలమణి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పోరెడ్డి మల్లారెడ్డి తెలిపారు.


Next Story