- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాబాలో మద్యం సిట్టింగ్ కి అనుమతి లేదు : ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, నిజాంసాగర్ : దాబా హోటల్ లలో మద్యం సిట్టింగులు నిర్వహించరాదని తహశీల్దార్ ఎదుట బైండోవర్ నిర్వహించగా దానిని ఉల్లంఘిస్తూ సిట్టింగ్ లు నిర్వహించిన యజమానికి తహసిల్దార్ రూ.50వేలు జరిమానా

దిశ, నిజాంసాగర్ : దాబా హోటల్ లలో మద్యం సిట్టింగులు నిర్వహించరాదని తహశీల్దార్ ఎదుట బైండోవర్ నిర్వహించగా దానిని ఉల్లంఘిస్తూ సిట్టింగ్ లు నిర్వహించిన యజమానికి తహసిల్దార్ రూ.50వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శేఖర్ 06.02.2025న అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగ్ నిర్వహించగా నిజాంసాగర్ ఎస్‌ఐ శివకుమార్ కేసు నమోదు చేసి తహశీల్దార్ బిక్షపతి వద్ద రూ.50,000/-కు ఒక సంవత్సరం కాలానికి బైండోవర్ చేయించారన్నారు. అయితే 28.10.2025న అదే దాబాలో మళ్లీ అక్రమ సిట్టింగ్ నిర్వహించగా.. పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారన్నారు. మొదటి బైండోవర్ షరతులను ఉల్లంఘించినందున, మంగళవారం నిజాంసాగర్ ఎస్‌ఐ శివకుమార్ చింతకింది శేఖర్ ను తహసిల్దార్ బిక్షపతి వద్ద బైండోవర్ చేయించి రూ.50,000/- జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని దాబాల యజమానులు వారి దాబాలలో మద్యం విక్రయాలు, సిట్టింగ్ లాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒకసారి బైండోవర్ చేసిన తరువాత మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






