- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత
దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని వాల్టా చట్టం ప్రకారం.. కేసు నమోదు చేయడం

దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని వాల్టా చట్టం ప్రకారం.. కేసు నమోదు చేయడం జరుగుతుందని నిజాంసాగర్ తహశీల్దార్ బిక్షపతి తెలిపారు. నిజాం సాగర్ మండలంలోని మంగళూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్ నెంబర్ TG17 5149, TS16EN 8956 గల రెండు ట్రాక్టర్ ల ద్వారా గ్రామ శివారులో గల వాగు ప్రాంతం నుంచి ఎలాంటి ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తన ట్రాక్టర్ లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. తహశీల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సాయిలు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్లను పట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. తహశీల్దార్ బిక్షపతి మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేనిదే ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సైతం జప్తు చేసుకుంటామని ఆయన వెల్లడించారు.






