- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెచ్చులూడుతున్న పాఠశాల పైకప్పు..రోడ్డెక్కి నిరసనలు
by velandi.Saikiran |
తమ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి

X
దిశ, కామారెడ్డి: తమ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాలలో ఆరవ తరగతి గదిలోని పైకప్పు పెచ్చులు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ సమయంలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం నిమిత్తం బయట ఉన్నారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం విద్యార్థులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తమ పాఠశాలకు వచ్చి పరిస్థితి చూడాలని కలెక్టర్ ను విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే పాత భవనాన్ని తొలగించి మరో కొత్త భవనం త్వరగా నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు.
Next Story






