అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్

by Disha Web Desk 13 |
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో అకాల వడగాళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంట పంటలను ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. అదివారం తాటిపల్లి గ్రామంలో రైతులను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. వరి కోత పంట చేతికచ్చే సమయానికి వడగళ్ల వానా చాలా బాధాకరం రైతులందరూ అధైర్య చెంద వద్దు.. ధైర్యంగా ఉండండి అని కోరారు.

ఎంతో కష్టపడి పండించిన పంట పకృతి వైపరీత్యం వల్ల ఇలా జరగడం బాధాకరం అని వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాస చర్యలలో భాగంగా రైతులకు ఎకరానికి రూ. 10 వేలు అందిస్తుందని సీఎం ప్రకటించారని కావున రైతులందరూ అధైర్య పడవద్దు అని ఆయన పేర్కొన్నారు. తాటిపల్లి గ్రామంలో అతి పురాతనమైన చెరువు మల్లం చెరువు అకాల వర్షం వల్ల తెగిపోవడం జరిగింది దాన్ని కూడా బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.

సిరికొండ నుండి వచ్చే పందిమడుగు తాటిపల్లి చిమన్ పల్లి, గ్రామాలకు ఫారెస్ట్ నుండి రోడ్డుకు క్లియరెన్స్ రావడం జరిగింది అతి తొందరలోనే రోడ్లను కూడా బాగు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాజిరెడ్డి వేంట ఎంపీపీ సంగీత, జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, రైతు సమన్వయ అధ్యక్షులు ఆకుల తిరుమల్, మండల యూత్ ప్రెసిడెంట్ చిగురు శ్రీనివాస్, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈఓ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed