తాడ్వాయిలో 'శతాబ్ది శంఖారావం'

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, తాడ్వాయి : తాడ్వాయిలో శ‌తాబ్ది శంఖారావంతో దేశ భ‌క్తి ఉప్పెనలా కనిపించింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తాడ్వాయి

తాడ్వాయిలో శతాబ్ది శంఖారావం
X

దిశ‌, తాడ్వాయి : తాడ్వాయిలో శ‌తాబ్ది శంఖారావంతో దేశ భ‌క్తి ఉప్పెనలా కనిపించింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తాడ్వాయి మండలంలోని ప్రతి గ్రామం, ప్రతి వాడ జాతీయతా భావంతో ఉప్పొంగిపోయింది. గ్రామ గ్రామాన స్వయంసేవకులు, స్థానిక దేశభక్తులు కలిసి 'శతాబ్ది శంఖారావం' పేరుతో సమావేశాలను, శోభాయాత్రలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సంఘ్ ముఖ్య కార్యకర్త మాట్లాడారు. సంఘం ఒక సంస్కారం, ఒక ప్రవాహం అని తెలిపారు. .భవిష్యత్తు తరాలు దేశభక్తిని,సేవా విలువలను వారసత్వంగా తీసుకునేందుకు ఈ 'శంఖారావం' ఒక నాంది అని తెలిపారు. మాకు అధికారం ముఖ్యం కాదు.. దేశం ఆత్మ గౌరవం, సేవ ముఖ్యం అని తెలిపారు. ఆదివారం తాడ్వాయిలో వెల్లివిరిసిన ఈ ఉత్సాహం యావత్ దేశానికి ఒక దిక్సూచి అని ఉద్ఘాటించారు. ఈ వందేళ్ల అండ మ‌రో వందేళ్ల పాటు దేశానికి ద‌న్నుగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు.

Next Story