- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ : హరీశ్ రావు
దిశ, గాంధారి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ మాస్టర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం

దిశ, గాంధారి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ మాస్టర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం గాంధారి మండల కేంద్రంలోని హరాలే గార్డెన్స్ లో గాంధారి మాజీ జడ్పీటీసీ హరాలే తానాజీ రావ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో హరీశ్ రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటుందని అది సబ్ బక్వాస్ అని ఆయన అన్నారు. దేశం కోసం అనే బీజేపీ కి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉంది అనే విషయం గుర్తుందా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రంది నిర్లక్ష్య వైఖరి అన్నారు. తెలంగాణలో ఎక్కువ భాగం ప్రవహించే గోదావరి నది పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100కోట్లు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. అయినా కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నోరు మెదపలేదని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేని చేతగాని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ అని నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగ ఉందని.. ఇదంతా కేసీఆర్ దూర దృష్టితోనే సాధ్యమైందని హరీష్ రావ్ తెలిపారు. కేంద్రం మెడలు వంచి మన నిధులు, మన హక్కులు సాధించుకోవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ఎంపీలు కూడా బీఆర్ఎస్ వాళ్లనే గెలిపించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకో.. దాచుకో అన్న చందంగా పాలన చేస్తుందని కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు కట్ చేస్తున్నారని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కనీసం పరిహారం కూడా అందించలేదని ఆయన విమర్శించారు. బీజేపీ నుంచి తిరిగి సొంత గూటికి చేరిన మాజీ జడ్పీటీసీ హరాలే తానాజీ రావ్ కి హరీష్ రావ్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. తానాజీ రావ్ వెంట ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి పలు మండలాలకు చెందిన ఆయన అనుచరులు దాదాపు 300 మంది గులాబీ కండువా కప్పుకున్నారు..






