కలెక్టరేట్ ముట్టడికి రేషన్ డీలర్లు యత్నం

by velandi.Saikiran |   (  Updated:2025-08-26 11:56:36  IST  )

రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినా తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చ

కలెక్టరేట్ ముట్టడికి రేషన్ డీలర్లు యత్నం
X

దిశ, కామారెడ్డి : రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినా తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జిల్లాలోని రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో 577 మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు.

గత 5 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. బియ్యం పంపిణీ అయిపోగానే కమీషన్ వెయ్యాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఒకే దఫాలో ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరిశెట్టి రాజు, గౌరవ అధ్యక్షుడు లక్ష్మిపతి యాదవ్, హేంసింగ్, మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజు, సంతోష్ రావు, శంకర్ రావు, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.

Next Story