- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక మాఫియాతో పోలీసుల దోస్తీ.. పోలీసుల వసూళ్లపై ఏసీబీ దాడులు...
ఇసుక మాఫియాతో చేతులు కలిపిన పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

దిశ, నిజాంసాగర్ : ఇసుక మాఫియాతో చేతులు కలిపిన పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణపై ఏసీబీ అధికారులు దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. తనిఖీల అనంతరం ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా ఇసుక మాఫియా నడుస్తుందని సమాచారం ఉందన్నారు. రోజు వందల సంఖ్యలో తిప్పర్ల అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని ఏసీబీ అధికారులకు అందిన సమాచారంతో బిచ్కుంద పోలీస్ స్టేషన్ పై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా అవసరమైన ఫైళ్ళను తనిఖీ చేసినట్లు తెలిపారు. చాలా రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న అక్రమ ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారని, సంబందిత ట్రాక్టర్ల విడుదలకు పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విశ్వశనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. సదరు పోలీసు అధికారులపై చర్యల కోసం ఉన్నత అధికారులకు పిర్యాదు అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని ఏసీబీ అధికారులను అందించాలని కోరారు.






