సివిల్స్ లో సత్తా చాటిన నిజామాబాద్ విద్యార్థి

by Disha Web Desk 1 |
సివిల్స్ లో సత్తా చాటిన నిజామాబాద్ విద్యార్థి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ 200, దీప్తి చౌహన్ 630 ర్యాంక్ లు సాధించారు. బోధన్ పట్టణం శక్కర్ నగర్ కు చెందిన చెందిన కంఠం మహేష్ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాలలో ఆలిండియా 200 ర్యాంక్ సాధించాడు. మహేష్ తండ్రి రాములు విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా, తల్లి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏ.ఎన్.ఎంగా పని చేస్తున్నారు. 200 ర్యాంక్ సాధించిన మహేష్ కు ఐ.ఏ.ఎస్ వచ్చే అవకాశం ఉంది. కంఠం మహేష్ విద్యాభ్యాసం నిజామాబాద్ లోనే కొనసాగింది. తమ కుమారుడికి సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దీప్తి చౌహన్ కు 630 ర్యాంక్..

నిజామాబాద్ నగరంలోని శిరిడి సాయి కృప నగర్ చెందిన సభావాత్ దీప్తి చౌహన్ కు సివిల్స్ లో 630 ర్యాంక్ వచ్చింది. తల్లి చంద్రకళ టీచర్ గా పని చేస్తుండగా తండ్రి కిషన్ లాల్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. దీప్తి భర్త ప్రవీణ్ వైద్య వృత్తిలో ఉన్నారు. దీప్తి మామ వెంకటయ్య నిజామాబాద్ రిటైర్డ్ ఆర్డీవోగా పని చేశారు.

Next Story