Kamareddy : నిజాం సాగర్ విషాదం.. ఇద్దరి మృతదేహాలు లభ్యం.. మరొకరి కోసం గాలింపు

by Muthe.Rajitha |

కామారెడ్డి(Kamareddy) జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో(Nizam Sagar Back Water) సోమవారం ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతైన విషాదం తెలిసిందే.

Kamareddy : నిజాం సాగర్ విషాదం.. ఇద్దరి మృతదేహాలు లభ్యం.. మరొకరి కోసం గాలింపు
X

దిశ వెబ్ డెస్క్ : కామారెడ్డి(Kamareddy) జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో(Nizam Sagar Back Water) సోమవారం ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతైన విషాదం తెలిసిందే. కాగా ఈ ఘటనలో నిన్న రాత్రి నుంచి గాలింపు కొనసాగుతుండగా.. మంగళవారం ఉదయానికి మధుకర్ గౌడ్, నవీన్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి, అయితే హర్షవర్ధన్ కోసం గాలింపు కొనసాగుతోంది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం సరదాగా స్నానాలు చేద్దామని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి 10 మంది యువకులు దిగారు.

వీరిలో ముగ్గురు ఎక్కువ లోతుకు దిగడంతో గల్లంతయ్యారు. వీరు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్ గౌడ్ (17), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (23), సోమార్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (17) గా పోలీసులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న నిజాం సాగర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి వెళ్లి నీట మునిగి గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వారిలో ఇద్దరి మృత దేహాలు మాత్రమే నేడు లభ్యం అయ్యాయి.

Next Story