ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎస్ఎంఈ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయాలి

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు అత్యవసరమని ఎమ్మెల్యే మదన్ మోహ‌న్ రాష్ట్ర అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎస్ఎంఈ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయాలి
X

దిశ, తాడ్వాయి : ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు అత్యవసరమని ఎమ్మెల్యే మదన్ మోహ‌న్ రాష్ట్ర అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య, వలసల నివారణ ఆర్థిక బలోపేతంపై ఆయన సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది కేవలం రాజకీయ వాగ్దానం కాదు,అది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.సరైన ప్రణాళికలు ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, ఆ ప్రణాళికలను అమలు చేసినప్పుడే సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు.


ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను అరికట్టాలంటే స్థానికంగా పరిశ్రమలు రావాల్సిన‌ అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, తద్వారా స్థానిక యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి,ఎల్లారెడ్డిని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలని మదన్ మోహ‌న్ డిమాండ్ చేశారు. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.

Next Story