దేవుడు చేసిన పాపం కాదు.. మంత్రులు చేసిన పాపం.. మునిగిన పంట పై క‌విత సెన్షేష‌నల్ కామెంట్స్..!

by Ratna Kumari |

దిశ, నవీపేట్ : గోదావరి పరివాహక ప్రాంతంలో వరదనీటిలో మునిగిన పంటలు దేవుడు చేసిన పాపం కాదని, రాష్ట్ర మంత్రులు చేసిన పాపంతోనే నిజామాబాద్ జిల్లా న

దేవుడు చేసిన పాపం కాదు.. మంత్రులు చేసిన పాపం.. మునిగిన పంట పై క‌విత సెన్షేష‌నల్ కామెంట్స్..!
X

దిశ, నవీపేట్ : గోదావరి పరివాహక ప్రాంతంలో వరదనీటిలో మునిగిన పంటలు దేవుడు చేసిన పాపం కాదని, రాష్ట్ర మంత్రులు చేసిన పాపంతోనే నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 5000 ఎకరాల్లో పంట మునిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు నవీపేట్ మండలంలోని యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రైతులతో కలిసి గోదావరి వరద నీటిలో మునిగిన వరి పంటలను పరిశీలించారు. రైతులు పడిన బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను కవితకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని మోసం చేసిందని రాష్ట్ర మంత్రులు తమ జిల్లాల రైతుల కొరకు నిజామాబాద్ జిల్లా రైతులని ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గోదావరి కి వరద వచ్చినప్పుడు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుంచి సందర్భాన్ని బట్టి నీటిని విడుదల చేసేవారని, కానీ ఈ సంవత్సరం గోదావరికి వరద ముప్పును ముందుగా గ్రహించలేక రాష్ట్ర మంత్రుల ఆదేశానుసారం ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేయలేకపోవడంతో వరద గ్రామాలను చుట్టుముట్టిందని దీనితో పది రోజులు వరద నీటిలో వరి పంట మునిగి ఉండడంతో రైతులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు రాజకీయాలను పక్కపెట్టి 9 గ్రామాల రైతులకు చెందిన 5 వేల ఎకరాల పంట పొలాలకు ఎకరానికి 50 వేల పంట నష్టం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేని ఎడల రైతుల పక్షాన పోరాడుతనని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వచ్చి పంటలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు తప్పుడు లెక్కలతో రైతుల పంట వివరాలు అందించారని, నీతిగా నిజాయితీగా పంట వివరాలను అందించి రైతులను ఆదుకోవాలని లేనియెడల కలెక్టర్ కార్యాలయం రైతులతో కలిసి ముట్టడిస్తానని కవిత హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని, ఎలక్షన్ టైం లో చేసిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. గత రెండు సంవత్సరాలలో ఒకేసారి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కొంతమందికే ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని, తులం బంగారం, బీడీల పింఛన్ 4 వేలు, వృద్ధాప్య పింఛన్ 4 వేలు పెంచుతామని మోసపూరిత వాగ్దానాలు చేసి అమలు చేయలేదని విమర్శించారు. బతుకమ్మ చీరలను కూడా ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి కి బతుకమ్మ అంటే ప్రేమ లేదని అందుకే తెలంగాణ తల్లి చేతుల నుండి బతుకమ్మను తీసేశారని అన్నారు. తాను గోదావరి ముంపు రైతుల తరపున పోరాటం చేసి నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తాను గతంలో విఠలేశ్వర్ ఆలయం దారి కొరకు రూ.50 లక్షలు మంజూరు చేసి నిర్మించిన రహదారిని పరిశీలించారు.

Next Story