- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంతింటి కలను నిజం చేయడమే తన లక్ష్యం : ఎమ్మెల్యే పోచారం
దిశ, బాన్సువాడ : సొంతింటి కలను నిజం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి

దిశ, బాన్సువాడ : సొంతింటి కలను నిజం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు లేని, కూలిపోయే స్థితిలో ఇళ్లు ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే నా లక్ష్యం అని.. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయన్నారు. లబ్ధిదారులు పిట్ల రుక్మిణి, గుల సాయవ్వలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, బాన్సువాడ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.






