- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపదలో ఉన్న పేదలకు అండగా మంత్రి వేముల
by Kema Shiva Kumar |
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఏ.లక్ష్మి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

X
దిశ, భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఏ.లక్ష్మి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సదరు మహిళను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతిలో జాయిన్ చేయించి చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల ఎల్.వో.సీ మంజూరు చేయించారు. అందుకు సంబంధించిన కాపీని బుధవారం బాధిత మహిళ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి, చికిత్స చేయిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని బాధిత కుటుంబం తెలిపారు.
Next Story






