- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతా, శిశు సంరక్షణ సేవలు ప్రతి గర్భిణికి అందేలా చూడాలి
మాతా, శిశు సంరక్షణ సేవలు క్షేత్ర స్థాయిలో ప్రతి గర్భిణీకి అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

దిశ, కామారెడ్డి : మాతా, శిశు సంరక్షణ సేవలు క్షేత్ర స్థాయిలో ప్రతి గర్భిణీకి అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.., ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించాలని, తద్వారా జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి లో రద్దీ తగ్గించేలా చూడాలని తెలిపారు.
అన్ని ఆసుపత్రుల్లో సిజేరియన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు పెంచాలని సూచించారు. ప్రస్తుత వేసవి కాలం వేడిమి వల్ల సంభవించే వడ దెబ్బ వంటి ఆరోగ్య సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి తగిన చర్యలు చేపట్టి రాపిడ్ రెస్పాన్స్ బృందాలను మండలాల వారిగా ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందు బాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆర్.బి.ఎస్.కే రాష్ట్రీయ బాల ఆరోగ్య స్వాస్త్ కార్యక్రమం లో అందరూ విద్యార్థుల కు స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు పెంచాలని, ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయ పాలన తప్పకుండా పాటించాలన్నారు. విధులకు గైర్హాజరు కాకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డా.శిరీష, డా.రాధిక, డా.విద్య, డా.ప్రభు కిరణ్, డా.అనురాధ జిల్లా లోని ప్రభుత్వ వైద్యులు, ఆర్.బి.ఎస్.కే.వైద్యులు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






