కేంద్రం పై మ‌హేష్ గౌడ్ త‌ప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం స‌రికాదు ఎంపీ అర్వింద్

by Ratna Kumari |   (  Updated:2025-10-15 09:27:40  IST  )

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వాస్త‌వాలు తెలుసుకోకుండా కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌ప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం స‌రికాద‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్

కేంద్రం పై మ‌హేష్ గౌడ్ త‌ప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం స‌రికాదు ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వాస్త‌వాలు తెలుసుకోకుండా కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌ప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం స‌రికాద‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాల‌యంలో బుధ‌వారం మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను కాంగ్రెస్ సరిగ్గా చేయకుండా డ్రామాలాడుతోందని తెలిపారు. ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందన్నారు. జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినా వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు నయా పైసా నష్టపరిహారం ప్రకటించలేదని, ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగిందేం లేదన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న మాధవనగర్, మామిడిపల్లి, అర్సపల్లి, ఆర్ఓబీ నిధులను కేంద్రం ఎప్పుడో డిపాజిట్ చేసిందన్నారు. ఆర్ఓబీ నిధులు కేంద్రం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల అవసరాలకు వాడుకుందని అర్వింద్ విమర్శించారు.

దీపావళి వరకు ప్రభుత్వానికి సమయమిస్తున్నానని.. అప్పటి వరకు ఆర్ఓబీలకు నిధులను విడుదల చేయాలని ఎంపీ అర్వింద్ తెలంగాణ సర్కార్ కు డెడ్ లైన్ విధించారు. అప్పటి లోపు కూడా నిధులు విడుదల చేయకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వం వాడుకున్న డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేయాలని, ఆ నిధులను అభివృద్ధి పనుల కోసం వెంటనే విడుదల చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఆర్ఓబీ ల నిర్మాణం పనులు నత్తనడకన జరుగుతున్నందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని అర్వింద్ తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేస్తున్నారన్నారు. పసుపు బోర్డుకు జిల్లా కేంద్రంలో రెండెకరాల స్థలం అడిగితే ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో తాము నాలుగు స్థలాలను గుర్తించి వాటిలో ఎక్కడో చోట పసుపు బోర్డు కోసం రెండెకరాలు ఇవ్వాలని కోరినా పని జరగడం లేదని అర్వింద్ తెలిపారు. అవసరమైన. అందరికీ అనుకూలమైన చోట స్థలం కేటాయించాలని అర్వింద్ కోరారు. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి తలొగ్గదని, ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.

దేశ భద్రతకు కల్వకుంట్ల కుటుంబం పెద్ద ముప్పు..

కల్వకుంట్ల కుటుంబం దేశ భద్రతకు పెద్ద ముప్పు అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని అర్వింద్ ఆరోపించారు. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసిందే బీఆర్ఎస్ నాయకులని, కేటీఆర్ అతి పెద్ద డ్రగ్స్ సప్లయర్ అని అర్వింద్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని, రాష్ట్రంలోకి | దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని అర్వింద్ అన్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే భారతీయులు కాని దొంగ ఓట్లను మాత్రమే తొలగించారని, బీఆర్ఎస్ హయాంలో దేశ భద్రతకు ముప్పు కలిగించే విదేశీయులకు కూడా బోధన్ లో 42 దొంగ పాస్ పోర్టులు ఇప్పించింది బీఆర్ఎస్ హయాంలోనే నని అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ దేశ భద్రతకు ముప్పు కలిగించే పార్టీ అన్నారు. జూబ్లీ హిల్స్ లో అపార్టుమెంట్లోని 43 ఓట్లు దొంగ ఓట్లయితే, బోధన్ లో బీఆర్ఎస్ హయాంలో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చిన సంగతిపై కేటీఆర్ ఏమంటారని అర్వింద్ ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా? జూబ్లీ హిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ కాదా? డ్రగ్స్ దందా అంతా కేటీఆర్ కనుసన్నల్లో జరగలేదా అని అర్వింద్ ప్రశ్నలను సంధించారు. వీటన్నింటికీ బీఆర్ఎస్, కేటీఆర్ సమాధానం చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బస్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తో పాటు బీజేపీ నాయకులు తదితరులున్నారు.

Next Story