- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్ల పై సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు
స్థానిక హోటళ్లలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను (డొమెస్టిక్) అక్రమంగా వినియోగిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు.

దిశ, తాడ్వాయి(లింగంపేట్): స్థానిక హోటళ్లలో గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను (డొమెస్టిక్) అక్రమంగా వినియోగిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 18 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ స్వామి మాట్లాడుతూ.. సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించే రాయితీ సిలిండర్లను హోటల్ యజమానులు వాడటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.లాభాపేక్షతో నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలలోని అన్ని హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ తనిఖీల్లో డీటీ సురేష్, డిటి షరీఫ్, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






