కలిసి పనిచేద్దాం .. సైబర్ మోసాలను అరికడదాం

by Ratna Kumari |

మండల కేంద్రంలోనీ గ్రామస్తులతో కలిసి బుధవారం "కలిసి పనిచేద్దాం సైబర్ మోసాలను అరికడదాం" అనే నినాదంతో ఏఎస్ఐ జి. నరేందర్ ప్రతిజ్ఞ చేయించారు.

కలిసి పనిచేద్దాం .. సైబర్ మోసాలను అరికడదాం
X

దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోనీ గ్రామస్తులతో కలిసి బుధవారం "కలిసి పనిచేద్దాం సైబర్ మోసాలను అరికడదాం" అనే నినాదంతో ఏఎస్ఐ జి. నరేందర్ ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆదేశాల మేరకు గ్రామస్తులతో కలిసి సైబర్ భద్రతా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు ఎక్కువగా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, నకిలీ లింకుల ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Next Story