- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు భారీ ఎత్తున టోకరా వేసిన స్వరూప అనే మాయ(కి)లేడి ఉదంతం

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు భారీ ఎత్తున టోకరా వేసిన స్వరూప అనే మాయ(కి)లేడి ఉదంతం నిజామాబాద్ నగరంలో శుక్రవారం వెలుగు చూసింది. ఈ మాయలో డ్యూటీలో పడి మోసపోయిన బాధితులంతా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు క్యూ కట్టారు. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్. అండ్ బి.సీఈ హోదాలోని అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఫెక్ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఉద్యోగాల పేరిట ఇంత పెద్ద ఎత్తున మోసం జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల వరకు కిలేడి స్వరూప వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో స్వరూప మోసానికి నిరుద్యోగులు బలైనట్లు తెలుస్తోంది. ఆమె వలలో చిక్కి మోసపోయిన నిరుద్యోగులు ఎంతమంది అన్నది ఖచ్చితంగా తెలువకపోయినా అత్యధిక సంఖ్యలో ఉంటారని టాక్ మోసపోయిన వారి నుంచి వినిపిస్తుంది. నిరుద్యోగులను నమ్మించేందుకు నిరుద్యోగులకు ఫోన్ చేసి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించారని బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. రూ. లక్షల్లో నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల కల్పన పేరుతో వసూలు చేసిన నకిలీ ఉద్యోగాల సృష్టికర్త స్వరూప తను ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు చెప్పుకుని తమను నమ్మించినట్లు బాధితులు పేర్కొన్నారు. తమ వద్ద డబ్బులు తీసుకుని ఉద్యోగ నియామక పత్రాలు అందించారన్నారు. అవి నకిలీ వని తేలడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన నిరుద్యోగులు లబోదిబోమంటూ బాధితులంతా న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. బాధితులంతా నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.
రైల్వే హెడ్ కానిస్టేబుల్ తో కలిసి..
ఉద్యోగుల పేరుతో యువతకు రూ. లక్షల్లో టోకరా వేసిన మాయలేడి స్వరూప రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని రూరల్ పీఎస్, త్రీ టౌన్ పీఎస్, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూపపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు అదుపులో స్వరూప?
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో మోసం చేసిన స్వరూప అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వరూప కు రూ. 8 లక్షలు చెల్లించా : బాధితుడి రాజు
స్వరూప అనే మహిళ తనకు తన స్నేహితుడైన శ్రీనివాస్ ద్వారా పరిచయమైందని, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్ జాబులు ఇప్పిస్తానని ఆమె నమ్మబలకడంతో తన స్నేహితుడు తాను కలిసి స్వరూప కు రూ. 8 లక్షలు చెల్లించామని బాధితుడు రాజు తెలిపారు. ఇప్పటివరకు తాను చాలామందికి వివిధ డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, వారికి సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాల కాపీలను తమకు చూపించి నమ్మించిందన్నారు. దీంతో తాము కూడా నమ్మి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుచేసి డబ్బులు తీసుకెళ్లి ఆమెకు చెల్లించామన్నారు. స్వరూప మాకు చూపించిన ఉద్యోగ నియమాక ఇదివరకు ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంతకం చేసిన ఉద్యోగ నియామక పత్రాలతో పాటు, ప్రస్తుత కలెక్టర్ టి వినాయక కృష్ణారెడ్డి సంతకం చేసిన జాబ్ ఆర్డర్ కాపీస్ కూడా తమకు ఆమె చూపించినట్లు బాధితులు రాజు, శ్రీనివాస్ లు తెలిపారు. తమలాగే చాలామంది నిరుద్యోగ యువకులు స్వరూప బారినపడి లక్షలాది రూపాయలు మోసపోయారని, పోలీసులు తమకు న్యాయం కల్పించాలని వేడుకుంటున్నారు.






