మహానటుడు మోడీని లండన్ పంపితే ఆస్కార్ వచ్చేది: మంత్రి కేటీఆర్

by Dishanational1 |
మహానటుడు మోడీని లండన్ పంపితే ఆస్కార్ వచ్చేది: మంత్రి కేటీఆర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంపై ఢిల్లీ వాళ్లు మోపైండు అంటూ బీజేపీ ప్రభుత్వంపై రాష్ర్ట మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. నిజాం సాగర్ మండలంలో నాగమడుగు ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేసి పిట్లం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రాష్ర్ట మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... ఇటీవల తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.. కానీ పాటకు అవార్డు వచ్చింది.. కానీ దేశంలో మహానటుడు అయిన మోడీ ఉన్నాడు.. అతడికి పంపితే ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చేది అన్నారు. దేశ్ వాసియో జనధన్ ఖాతా కోలో గరిబి హఠాకే ప్రతి ఒక్కరి ఖాతాలో పంద్రలాక్ జమా చేస్తా అని అన్నాడు.. ఇచ్చిండా అని ప్రశ్నించారు. దేశం మొత్తం సంపద దోచి దోస్తు ఖాతాలో వేసి వారివద్ద చందాలు తీసుకుని పార్టీలను చీల్చాలి ఇదే మోడీ విధానం అన్నారు.

రైతుల ఆదాయం డబుల్ కావాలి అన్నాడు. గుజరాత్ లో ఒక్క రైతు ఉల్లి అమ్మితే రెండు రుపాయలు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానటుడు మోడీ ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు వచ్చాయా ఉద్యోగాలు అని అడిగారు. మోడీ బాత్ కరోడే కామ్ పకోడోమే కర్తా హై అని ఎద్దేవా చేశారు. మన్మోహన్ ప్రభుత్వం హయాంలో గ్యాస్ బండ ధర రూ. 400 ఉంటేనే దద్దమ్మా అన్నాడు. 400 నుంచి 1200 అయితే ఇప్పుడు సన్నాసి అనాల్నా అన్నారు. దేశ సంపదను అదానీ లాంటి దోస్తుకు దోచిపెట్టినందుకు అయనకు మోడీ దేవుడు కావచ్చు కానీ తెలంగాణకు పట్టిన శని, దరిద్రం మోడీ అని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెరిగింది కాబట్టి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో జుక్కల్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రావద్ధు అన్నారు. తెలంగాణపై నరేంద్ర మోడీ కక్ష కట్టిండు కాబట్టి తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన విభజన చట్టంలోని ఒక్క హామీ అమలు చెయ్యలేదన్నారు. మోడీకి ఈడీకి ఎవ్వరికీ భయపడేది లేదు అని, రాబోయే ఎన్నికలలో ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం అన్నారు.

కాంగ్రెస్ రాష్ర్టఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్యాయం జరిగిపోతుంది అని పాదయాత్రల పేరుతో తిరుగుతున్నారు అని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ వాళ్లకు 50 ఏండ్లు అవకాశం ఇచ్చినప్పుడు చేతగాని వారు ఇప్పుడు ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ల కథనే అలాగా ఉందని అధికారం ఇచ్చినప్పుడు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు గానీ ఇప్పుడు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు అన్నారు. రోశయ్య, నల్లారి కిరన్ కుమార్ రెడ్డి, వైఎస్ లాగా చాలమంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చేతగాలేదు కానీ ఒక్క చాన్స్ అని ఎలా అడుగుతారు ప్రశ్నించారు. ఇడా గుడా ఉన్నాడు గంగారామో బొంగరామో అనే లీడర్ ఉన్నాడని గుర్తు చేశారు. అవకాశం ఇచ్చినప్పుడు చేతగానోడు అడిగితే పడిపోదమా అని ప్రజలను మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.

మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ను గెలిపించాలి..

ఎలక్షన్ రాంగానే గంగిరెద్దులోడు వచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వస్తారు.. వారిని ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ను గెలిపించాలి అని కోరారు. ప్రస్తుత శాసన సభ్యుడు హన్మంత్ షిండేకు వచ్చే ఎన్నికలలో 72 వేల మెజార్టీ కట్టాబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ జుక్కల్ నియోజకవర్గంకు అవతల ఉన్న కర్నాటక, మహరాష్ర్టలలో అమలు చేస్తలేరని అన్నారు. ప్రజలు అలోచన చేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న హన్మంత్ షిండేను గెలిపించాలని పలు మార్లు కేటీఆర్ ప్రజలను కోరారు. జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం, బిచ్కుంధలను మున్సిపాల్టీలుగా మారుస్తానని హమీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరిన రోడ్లు, బ్రిడ్జీలతోపాటు జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారన్నారు.


Next Story