రైతు రత్న అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

by Ratna Kumari |

దిశ‌, ఆలూరు : ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా

రైతు రత్న అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ‌, ఆలూరు : ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ సంవత్సరం “రైతు రత్న అవార్డులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ సుస్థిర, సేంద్రీయ, వినూతన వ్యవసాయ విధానాలను అనుసరించి విశిష్ట సేవలు అందిస్తున్న రైతులు మహిళా రైతులను ఈ అవార్డుల ద్వారా సత్కరించనున్నారు. మహా కిసాన్‌ మేళా సందర్భంగా డిసెంబర్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లోని అవార్డులు ప్రధానం చేయబడతాయని రైతుల ఎంపికను తెలంగాణ అగ్రికల్చరల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించనుంది. అర్హులైన రైతులు తమ దరఖాస్తులను సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లేదా నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ వ్యవసాయ అధికారులకు సంఘ ప్రతినిధులకు ఈ నెల 20 లోగా సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు రాష్ట్ర నాయకులు మహేందర్ 8977752450, జిల్లా అధ్యక్షులు రాంబాబు 8977752269, కార్యదర్శి నర్సయ్య 8977752449, సభ్యులు, సాయి కృష్ణ 8977752386, వైష్ణవ్ 8977752406 సంప్రదించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Next Story