ఆక‌తాయిలు ఈవ్ టీజింగ్ కి పాల్ప‌డితే స‌మాచారం అందించాలి : SHO స‌త్య‌నారాయ‌ణ గౌడ్

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : ఆకతాయిలు ఈవ్ టీజింగ్‌ కు పాల్పడితే వెంటనే సమాచారాన్ని షీ టీమ్ కి అందించాలని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ అన్నారు.

ఆక‌తాయిలు ఈవ్ టీజింగ్ కి పాల్ప‌డితే స‌మాచారం అందించాలి :  SHO స‌త్య‌నారాయ‌ణ గౌడ్
X

దిశ, ఆర్మూర్ : ఆకతాయిలు ఈవ్ టీజింగ్‌ కు పాల్పడితే వెంటనే సమాచారాన్ని షీ టీమ్ కి అందించాలని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహిళా జూనియర్ కాలేజ్ లో క్రైమ్ గురించి విద్యార్థినిలకు ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా SHO మాట్లాడారు. విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్‌ 8712659795 కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన ఈవ్ టీజింగ్ చేసిన ఎలాంటి భయాందోళనకు గురికాకుండా షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి, కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ M. S. V. ప్రసాద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story