భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపిన భర్త..

by Bhanu |   (  Updated:2025-05-19 13:35:54  IST  )

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సోమవారం కలకలం రేగింది.

భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపిన భర్త..
X

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సోమవారం కలకలం రేగింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెద్ద బజారు నందు తమ్మలి ప్రవీణ్ ఇంట్లో కిరాయికి ఉంటున్న ముద్దంగుల గంగాధర్ ఆయన భార్య ముద్దంగుల అంజలి పై అనుమానంతో కత్తితో గొంతు కోసి ఆమె భర్త హత్య చేశాడు. సంఘటనా స్థలాన్ని సోమవారం ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. భార్య అంజలిని భర్త గంగాధర్ కత్తితో కోసి హత్య చేశాడని స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు సత్యనారాయణ గౌడ్ వివరించారు.

Next Story