పార్లమెంట్ ఎన్నికల తెరపైకి గల్ప్ బోర్డు

by Disha Web Desk 12 |
పార్లమెంట్ ఎన్నికల తెరపైకి గల్ప్ బోర్డు
X

దిశ ప్రతినిధి , నిజామాబాద్: గత పార్లమెంట్‌ ఎన్ని కల్లో పసుపు బోర్డు అంశం గెలుపోటములను ప్రభావితం చేసినట్లుగానే ప్రస్తుతం గల్ఫ్‌ బోర్డు అంశం ప్రభావితం చేయనుందన్న చర్చలు జరుగుతున్నాయి. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. వచ్చే నెల 13న ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు చేసే హామీలపై కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరిట మేనిఫెస్టోను విడుదల చేసిన, భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. ఆయా జాతీయ పార్టీలు తమకు ఎన్నికల్లో గెలిచేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధానంలో తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నికల హామీ పత్రాలను ఓటర్ల పైకి వదిలారు.

అది ఎంత మేరకు వారికి ఓట్లు రాల్చుతాయి ఎన్నికల ఫలితాల్లో బహిర్గతం కానుంది. కానీ ఈ సారి రెండు జాతీయ పార్టీలు ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు ప్రధాన అంశంగా తెరపైకి తెస్తున్నాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రవాసీయులు సమావేశాలను నిర్వహిస్తుండగా , తాము గత ఏడాది ఈ విషయంలో గల్ఫ్ ప్రవాసీయుల సమావేశం ఫొటోలను విడుదల చేసింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు అంశం ప్రధాన అస్త్రంగా రెండు జాతీయ పార్టీలు ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

అసెంబ్లీ ఎన్నికలు అనేవి సాధారణంగా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం తో పాటు లోకల్ లీడర్లను బట్టి జరుగుతాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం తరువాత రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నికల ఫలితాలు ఇవి రుజువు చేస్తాయి. కానీ పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మాత్రం చరిస్మా ఉన్న లీడర్లతో పాటు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అనేది 2019 ఎన్నికలు నిరూపించాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలు అంతటా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముందున్న బీఆర్ఎస్ కు పట్టం కట్టిన విషయం తెలిసిందే.

అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు తెలంగాణ ప్రసిద్ధ బోధన్ చక్కెర కర్మాగారం తెరిపించడంతో పాటు తెలంగాణలో అత్యధికంగా గల్ఫ్ కార్మికులు కలిగిన నిజామాబాద్ జిల్లా ఓటర్లు ఆకట్టుకునేందుకు ఎన్ఆర్ఐ పాలసీ తేవడంతో పాటు రూ.500 కోట్లతో ప్రత్యేక గల్ఫ్ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ గణనీయమైన ఎంపీ సీట్లు గెలిచిన వాటిని అమలు చేయలేదు. 2019 ఎన్నికల నాటికి జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది జరగక పోవడంతో పాటు జాతీయ పార్టీ అయితే పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని ప్రజలు, రైతులు విశ్వసించి ఆనాడు రైతులు నామినేషన్లు దాఖలు చేసి అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు.

ఇప్పుడు మళ్లీ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధికంగా ఉన్న తెలంగాణ ప్రవాసీయుల,వారి కుటుంబ సభ్యుల ఓట్లను రాబట్టుకునేందుకు ఈ సారి గల్ఫ్ బోర్డు తెరపైకి తీసుకు వచ్చినట్లు చెప్పాలి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 2014 లో చక్కెర కర్మాగారం తెరిపించడం,2019 లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కుల సామాజిక ఓటర్ల కన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి ఓటర్లను వారి కుటుంబ సభ్యుల ఓటర్లు కీలకం గా ఉన్నాయి. ఓట్లను రాబట్టుకునేందుకు రెండు జాతీయ పార్టీలకు ఒక లెక్క ఉంది. అందుకే ఇప్పుడు ప్రజలు ఎప్పటి నుంచి ఉన్న గల్ఫ్ బోర్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ప్రవాస భారతీయులకు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని ఆదుకుంటామని వారి యోగ క్షేమాలను పట్టించుకుంటారని చెప్పుకొస్తున్నారు. ఉపాధి నిమిత్తం ఎడారి దేశాలకు వలస వెళ్లిన వారిని నాకట్టుకోవడంతోపాటు వారి కుటుంబాల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చెరకు రైతులను ఇటీవల పసుపు రైతులు గంపగుత్తగా తమ ఖాతాల్లో వేస్తున్నట్లు ఈసారి గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న జిల్లా వాసులే టార్గెట్ గా గల్ఫ్ బోర్డు అంశాన్ని తీసుకున్నారని చెప్పాలి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దుబాయ్ లో తెలంగాణ వాసులతో సమావేశం నిర్వహించి ఇటీవల ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా 2023లో ప్రవాసీయులు బీజేపీ నిర్వహించిన సమావేశ ఫొటోలను షేర్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తాను ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకు తన వంతుగా పని చేస్తున్నారని, గతంలోనే గల్ఫ్ దేశాల్లో జైల్లో చిక్కుకున్న వారికి, అక్కడ చనిపోయిన వారిని డెడ్ బాడీలను ఇండియాకు రప్పించామన్నారు. గడిచిన బడ్జెట్ లో వంద కోట్లు విడుదల చేసినట్లు అవి ఖర్చు చేయక ముందే ఎన్నికలు వచ్చాయని ఈసారి తాను గెలిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్ లో గళమెత్తుతానన్నారు.

Next Story

Most Viewed