నటి అంజలితో ప్రేమాయణం.. మరో హీరోయిన్‌ను పెళ్లాడిన హీరో న్యూ జర్నీ స్టార్ట్ అంటూ పోస్ట్

by Dishafeatures1 |
నటి అంజలితో ప్రేమాయణం.. మరో హీరోయిన్‌ను పెళ్లాడిన హీరో న్యూ జర్నీ స్టార్ట్ అంటూ పోస్ట్
X

దిశ,సినిమా: ‘జర్నీ’ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయిన తమిళ నటుడు జై గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదే సినిమాలో నటించిన మన తెలుగు అమ్మాయి అంజలి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు కానీ అనూహ్యంగా వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నాక ఈ వార్తలకు బ్రేక్ పడింది.

అయితే తాజాగా జై..హీరోయిన్ ప్రగ్యా నగారా తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేయగా అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలో ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉండగా పక్కనే ఆమెకు బాగా దగ్గర కూర్చున్న జై తన చేతిలో రెండు పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్స్ తో కనిపించాడు. దేవుడి దయతో కొత్త జీవితం స్టార్ట్ అయింది అంటూ ఇద్దరూ ఒకే ఫోటోని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకుని హనీమూన్ కి వెళుతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు చాలామంది వీరిద్దరికి కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.

అయితే తమిళ సినీ వర్గాల్లో వీరిద్దరూ కలిసి ‘బేబీ అండ్ బేబీ’ అనే ఒక సినిమా చేస్తున్నారని ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోందని ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ అని చెబుతున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా మొదలు పెట్టడం కంటే ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తే త్వరగా జనాల్లోకి వెళ్తుంది అని భావించి ఈ మేరకు ఫొటో రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే వారిద్దరూ షేర్ చేసిన ఫోటో వెనుక మూవీ కెమెరా అయితే కనిపిస్తుండటం తో దాదాపు ఇది సినిమా ప్రమోషన్ అని ఫిక్స్ అయిపోవచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed