జెండా బాలాజీ మందిరంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-14 15:47:42  IST  )

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండాగల్లీలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం జెండా బాలజీ మందిరంలో బుధవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ వారి ఆధ్వ‌ర్యంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వ‌హించారు.

జెండా బాలాజీ మందిరంలో ఘనంగా గోదాదేవి కళ్యాణం
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండాగల్లీలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం జెండా బాలజీ మందిరంలో బుధవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ వారి ఆధ్వ‌ర్యంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వ‌హించారు. వందలాది భక్తుల గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణ క్రతువును ఆలయ అర్చకులు నాగరాజాచార్య ఆధ్వర్యంలో సాంబమూర్తి, జయరాజ్ జోషి లు నిర్వహించారు. ఆలయ అర్చకుల సర్వజ్ఞల సహకారంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జి. వేణు, ఆలయ ధర్మకర్తల మండలి లవంగ ప్రమోద్ కుమార్ వేముల దేవిదాస్, పోలకొండ నర్సింగరావు, సిర్ప కిరణ్, పవార్ విజయ, కొర్వ రాజు, అన్నప్రసాద వితరణ దాత డాక్టర్ శ్రీచంద్ర శేకర్ రావు, రమాదేవి దంప‌తులు పాల్గొన్నారు.

Next Story