ఘ‌నంగా రేణుక ఎల్ల‌మ్మ వార్షిక ఉత్స‌వాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ ఏరియాలో మున్సిపల్ 6 వ వార్డు పరిధిలో గల రేణుకా మాత ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుక‌లు కోటార్ మూర్ గీత

ఘ‌నంగా రేణుక ఎల్ల‌మ్మ వార్షిక ఉత్స‌వాలు
X

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ ఏరియాలో మున్సిపల్ 6 వ వార్డు పరిధిలో గల రేణుకా మాత ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుక‌లు కోటార్ మూర్ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వాలు చాలా వైభ‌వంగా నిర్వ‌హించామ‌ని గౌడ సంఘం అధ్య‌క్షుడు నాగుల కృష్ణ‌గౌడ్ తెలిపారు. రేణుక ఎల్ల‌మ్మ ఉత్స‌వాలు అక్టోబ‌ర్ 08న ప్రారంభ‌మ‌య్యాయ‌ని.. గౌడ సంఘానికి చెందిన ప్ర‌తీ స‌భ్యుడు ఇంటి ముందు పందిర్ల కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. గురువారం రేణుక మాత ఎల్ల‌మ్మ ఆవ‌ర‌ణ‌లో య‌జ్ఞం, క‌ళ్యాణం నిర్వ‌హించారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని అన్న‌ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. శుక్ర‌, శ‌నివారాల్లో గౌడ సంఘం మ‌హిళా ప్ర‌తినిధులు మంగ‌ళ‌హార‌తుల‌తో జోగు తిరుగుతారు. ఆదివారం రోజు గ్రామ‌దేవ‌త‌ల‌కు నీళ్ల‌తో అభిషేకం నిర్వ‌హించి మ‌ధ్యాహం త‌రువాత బోనాల‌తో ర్యాలీగా వెళ్తారు. 13న గౌడ కుల సంఘం సాంప్ర‌దాయం ప్ర‌కారం.. బోనాల‌ను హ‌న్ మాన్ మందిరం వ‌ద్ద‌కు ఎదుర్కొని ఆ త‌రువాత ఎల్ల‌మ్మ వ‌ర‌కు ఎదుర్కొంటున్నారు. రాత్రి బోనాల‌ను తీసుకొని హ‌నుమాన్ మందిరానికి త‌ర‌లివ‌స్తారు. మంగ‌ళ‌వారం రోజు అమ్మ‌వారి క‌ళ్యాణం, గావ్ పెట్టే కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు నాగుల కృష్ణ‌గౌడ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్టర్లు జామగోని సుదర్శన్ గౌడ్, జాగిరి తిరుపతి గౌడ్, జోగినపల్లి సంతోష్ గౌడ్, కొండ జనార్దన్ గౌడ్, కోటార్ మూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మెరుగు మహేందర్ గౌడ్, సభ్యుడు గోరింటాల నరేష్ గౌడ్ తో పాటు ప్ర‌జ‌లు పాల్గొన‌నున్నారు.

Next Story