మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలి : మంత్రి అజారుద్దీన్

by Nallavelli.Anjaneyulu |

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమన్వయంతో కృషి చేస్తే విజయం సాధిస్తామని రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలి : మంత్రి  అజారుద్దీన్
X

దిశ, నిజాంసాగర్ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమన్వయంతో కృషి చేస్తే విజయం సాధిస్తామని రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని ఆయన అధికారిక కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సమన్వయంతో కీలక దిశానిర్దేశక సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి.. రానున్న ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తే విజయం ఖాయం అని స్పష్టం చేశారు.

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆశావాహుల వివరాలు, ప్రజాభిప్రాయాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీ విజయానికి దోహదపడేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించి, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కీలక సూచనలు తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మహమ్మద్, బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.

Next Story