72 గంటల్లో ఆక్రమణలు తొలగించాలి

by Naveena |

నిజామాబాద్ నగరంలోని ప్రధాన రహదారులైన హైదరాబాద్ రోడ్డు, బైపాస్ రోడ్డు, వర్ని రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్లలతో పాటు పలు అంతర్గత రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

72 గంటల్లో ఆక్రమణలు తొలగించాలి
X

దిశ, నిజామాబాద్ అర్బన్:నిజామాబాద్ నగరంలోని ప్రధాన రహదారులైన హైదరాబాద్ రోడ్డు, బైపాస్ రోడ్డు, వర్ని రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, బోధన్ రోడ్లలతో పాటు పలు అంతర్గత రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన వెలువడిన 72 గంటలోపు ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వారి ఆక్రమణలను తొలగించాలన్నారు. ఒక వేళ తమకు తాముగా స్వచ్ఛందంగా తొలగించని ఆక్రమణలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో..తొలగించి ఆక్రమణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story