- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ కూలీలు ఉదయం వేళల్లో పని చేయాలి
ఉపాధి హామీ పథకం కూలీలు తమ గ్రామంలో ఉదయం వేళలోనే పనిచేయాలని కోమలంచ గ్రామ సర్పంచ్ లక్ష్మి నాగభూషణంగౌడ్ అన్నారు.

దిశ, నిజాంసాగర్ : ఉపాధి హామీ పథకం కూలీలు తమ గ్రామంలో ఉదయం వేళలోనే పనిచేయాలని కోమలంచ గ్రామ సర్పంచ్ లక్ష్మి నాగభూషణంగౌడ్ అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాలను సందర్శించి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలకు తాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ (FA), అధికారులకు సూచించారు. కూలీలకు సమయానికి సరైన కూలి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కూలీలకు కూడా పలు సూచనలు చేశారు. ఎండల సమయంలో మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ పని చేయాలని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
తలకు గుడ్డలు కట్టుకోవడం, ఉదయం , సాయంత్రం సమయాల్లో ఎక్కువ పని చేయడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. ఎవరైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే పనిని ఆపి అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి నాగభూషణం గౌడ్ మాట్లాడుతూ ఎండల తీవ్రతలో పనిచేస్తున్న కూలీల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యం అన్నారు. ప్రతి పని ప్రదేశంలో తాగునీరు, అవసరమైన సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి అని తెలిపారు. కూలీలు చేసిన పనికి సరైన పారితోషికం సమయానికి అందేలా పర్యవేక్షణ చేస్తాం అని చెప్పారు. గ్రామ అభివృద్ధి కూలీల కష్టంతోనే సాధ్యమవుతుంది. వారి సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.






