- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెరవేరని ఇంటి కల.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్రూం ఇండ్ల కల కలగానే మిగిలిపోతుంది.

దిశ, ఆర్మూర్ : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్రూం ఇండ్ల కల కలగానే మిగిలిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్న పేద ప్రజలకు నిరాశే మిగులుతుంది. కొంతమంది లబ్ధిదారులమనుకున్న వారు కూడా సొంత డబ్బులతో ఇండ్ల నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయిన కూడా పంపిణీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలతో పాటు మండల స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గదుల్లో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణ పరిసర ప్రాంతాలతోపాటు నిర్మాణంలో ఉన్న ఇండ్లను అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటివరకు కూడా పంపిణీ చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీగా కంప చెట్లు మొలవడంతో అధ్వానంగా మారాయి. కిటికీలు, తలుపులు విరిగిపోవడంతో పాటు పలుచోట్ల గోడలు కూడా కూలిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను పంపిణీ చేసిన ఎలా నివాసం ఉండాలో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆసరాగా చేసుకుని చెడు వ్యసనాలకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టణ కేంద్రం పరిధిలో గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టి, పూర్తి స్థాయిలో పూర్తికాని డబుల్ బెడ్రూం నిర్మాణాలు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంతో పాటు, ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మ కాలనీలో, కోటార్ మూర్ ఏరియాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. పోచమ్మ కాలనీ, కోటార్ మూర్ 44వ జాతీయ రహదారి ప్రక్కన నిర్మించిన డబుల్ బెడ్రూంలు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. 2018 బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రెండు ఏరియాల్లో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూములు ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ జరగలేదు. నిర్మాణాలు పూర్తిస్థాయిలో డబుల్ బెడ్రూంలకు చేపట్టకపోవడంతో చేసిన నిర్మాణాలు సైతం చెడిపోతున్నాయి. నిర్మానుష్యమైన, ఆర్మూర్ మున్సిపల్ పట్టణానికి కొద్దిగా దూరంలో డబల్ బెడ్రూంల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇవి ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి. ఈ అసంపూర్తి డబుల్ బెడ్రూంల నిర్మాణాలను అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ఏరియాల్లో ఆకతాయిల హిస్టారీతి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పార్టీలు చేసుకోవడం, అక్రమ గేమింగ్లు నిర్వహణ చేయడం, జూదాలు ఆడడం, హిస్టారీతిగా మందు సేవించడానికి, గంజాయి అక్రమంగా సేవించే ఆకతాయిలకు ఈ డబుల్ బెడ్రూంలు అడ్డాలుగా మారాయి.
డబల్ బెడ్రూంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేస్తే డబుల్ బెడ్ రూములలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అనుకున్న డబుల్ బెడ్రూంల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుపేదలు సంతోషం వ్యక్తం చేసి వారి కుటుంబాలతో ఆ గృహాల్లో నివాసాలు ఉండనున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్రూంలపై దృష్టి సారించి వాటిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి సౌకర్యాలు కల్పించి అర్హులైన నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డంగా మారిన ఆర్మూర్ మున్సిపల్ లోని పోచమ్మ కాలనీ, కోటార్ మూర్లలోనిడబుల్ బెడ్రూంలను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని, అంతకుముందు ఆ ఏరియాల్లో అన్ని వస్తువులు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ సయ్యద్ అవేజ్ శనివారం డిమాండ్ చేశారు. దీనిపైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి లు దృష్టి సారించి ఏండ్లుగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పోచమ్మ కాలనీ, కోటార్ మూర్ ఏరియాలో వృధాగా ఉంటున్న డబుల్ బెడ్రూంలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేయించి వసతులను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






