- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్యప్రాణులకు హాని కలిగించొద్దు : FDO పీవీ రామకృష్ణ
దిశ, భిక్కనూరు : అటవీ ప్రాంతాలలో సంచరించే వన్య ప్రాణులు దారి తప్పి ఈ ప్రాంతాల్లో సంచరిస్తే వాటికి హాని కలిగించొద్దని అటవీ

దిశ, భిక్కనూరు : అటవీ ప్రాంతాలలో సంచరించే వన్య ప్రాణులు దారి తప్పి ఈ ప్రాంతాల్లో సంచరిస్తే వాటికి హాని కలిగించొద్దని అటవీ శాఖ కామారెడ్డి డివిజన్ రేంజ్ ఆఫీసర్ పీ.వీ. రామకృష్ణ సూచించారు. బుధవారం భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని రైతు వేదికలో ఇటీవల పులి దాడిలో మృతి చెందిన ఆవు యజమాని తోట రామచంద్రం కు ప్రభుత్వం అందజేసిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత యజమానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లేగ దూడ యజమాని నారాయణ కు రూ.35 వేలు ఆర్థిక సహాయాన్ని డిపార్ట్మెంట్ తరపున అందజేసినట్లు చెప్పారు. పులి, చిరుత ఏవైనా వన్యప్రాణులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. ఒకవేళ వన్యప్రాణులకు హాని కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, అందుకు సంబంధించిన విషయాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయా గౌడ్, ఎఫ్ఆర్వో రమేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సయ్యద్ బాబా, బీట్ ఆఫీసర్లు దీపిక, సురేష్ పాల్గొన్నారు.






