అధైర్య పడకు... అండగా ఉంటా...

by Disha Web Desk 15 |
అధైర్య పడకు... అండగా ఉంటా...
X

దిశ, భిక్కనూరు : అధైర్య పడకు... అండగా నిలబడతానని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్థన్ ధైర్యం నూరి పోశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్ల పల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ నాగన్న గారి అనసూయ అల్లుడు పెద్ద సిద్దరాంరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతదేహంపై పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుని బావమరిది,

బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి బావ మరణాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే గంప వద్ద బోరున విలపించాడు. ఆయనను చేరదీసి ఏడవద్దని...అన్ని రకాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించాడు. ఆయన వెంట ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, భిక్కనూరు మాజీ సర్పంచ్ తాటిపాముల నాగభూషణం గౌడ్, సొసైటీ డైరెక్టర్ నాగన్న గారి మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ నాగన్న గారి నడిపి మల్లారెడ్డి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుమాల సాయిలు, పార్టీ సీనియర్ నాయకుడు నాగన్న గారి ప్రతాపరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed