సీఎం కప్ క్రీడలకు 45 వేల బహుమతుల విరాళం

by Ratna Kumari |

సీఎం కప్ మండల స్థాయి క్రీడల్లో పాల్గొని విజేతలైన క్రీడాకారులకు మండల బీజేపీ మహిళా నాయకురాలు కొండ మీరాతాయి తన సొంత‌ ఖర్చులతో రూ.40 వేలు విలువైన బహుమతులను ప్రదానం చేశారు.

సీఎం కప్ క్రీడలకు 45 వేల బహుమతుల విరాళం
X

దిశ, నాగిరెడ్డిపేట్ : సీఎం కప్ మండల స్థాయి క్రీడల్లో పాల్గొని విజేతలైన క్రీడాకారులకు మండల బీజేపీ మహిళా నాయకురాలు కొండ మీరాతాయి తన సొంత‌ ఖర్చులతో రూ.40 వేలు విలువైన బహుమతులను ప్రదానం చేశారు. నాగిరెడ్డిపేటలో సీఎం కప్ క్రీడలు శనివారంతో ముగిశాయి. సీఎం కప్ మండల స్థాయి క్రీడలను మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులపాటు అధికారులు నిర్వహించారు. సీఎం కప్ క్రీడల్లో కబడ్డీ, వాలీబాల్, నెట్ బాల్, ఖోఖో, అట్లాటిక్స్ క్రీడలను నిర్వహించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన జట్లకు మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన బీజేపీ నాయకురాలు కొండ మీరాతాయి 45 వేల విలువగల బహుమతులను విరాళంగా అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు. అలాగే తాము ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి రాణిస్తే పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా ఎదుగవచ్చన్నారు. సీఎం కప్ క్రీడ‌ల ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అధికారులు బహుమతుల ప్రదానం చేశారు.

Next Story