- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజనులకు దోమ తెరలు, విద్యార్థులకు బెంచీలు వితరణ
దిశ, మాచారెడ్డి : అడవుల్లో నివసించే గిరి పుత్రులు మలేరియా, డెంగీ, విష జ్వరాలతో అనారోగ్యం బారిన పడుతున్న గిరిజనులకు దోమ తెరలు, విద్యార్థులకు బెంచీలు

దిశ, మాచారెడ్డి : అడవుల్లో నివసించే గిరి పుత్రులు మలేరియా, డెంగీ, విష జ్వరాలతో అనారోగ్యం బారిన పడుతున్న గిరిజనులకు దోమ తెరలు, విద్యార్థులకు బెంచీలు మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు అధ్యక్షతన వితరణ చేశారు. మాచారెడ్డి మండలం ఎల్లంపేట పరిధిలోని వివిధ గిరిజన తండాలకు చెందిన గిరిజనులకు దాదాపు 1000 దోమ తెరలు, గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు బెంచీలు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోయపల్లి నర్సింగరావు మాట్లాడుతూ దోమ తెరలు స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీపీసీ సీఎస్ఆర్ చొరవతో 1000 దోమ తెరలు, మాచారెడ్డి మాజీ ఎంపీపీ, హైదరాబాద్ కాంటాన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లోయపల్లి నర్సింగరావు పాఠశాల విద్యార్థులకు 120 బేంచీలు పంపిణీ చేశారు. ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు సేవా దృక్పథానికి ముగ్ధులయ్యారు. అనంతరం ఆయనకు జ్ఞాపిక అందించి శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాణిగ్రహి, (చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) ఎన్టీపీసీ ఎస్ ఆర్ హెచ్ క్యూ ), దీపక్ బట్టాచార్జీ, రాజేంద్ర ప్రసాద్, మాచారెడ్ఠి మాజీ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రామ్మోహన్, సింగిల్ విండో చైర్మన్ స్వామి గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కంది ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు చంద్రూ నాయక్ పాల్గొన్నారు.






